`అరుంధ‌తి` మూవీకి సోనూసూద్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!

అరుంధ‌తి.. ఈ సినిమాను, అందులోని పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేరు. సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన చిత్ర‌మిది. ఈ మూవీతోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ గా మారింది. కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పెద్ద‌గా అంచ‌నాలు ఏమీ లేకుండా 2009లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

అయితే ఈ సినిమాలో అనుష్క పోషించిన అరుంధతి పాత్ర త‌ర్వాత బాగా హైలెట్ అయింది పశుపతి రోలే. ఈ రోల్ ను సోనూ సూద్ చేశాడు. క్రూర‌మైన పాత్ర‌లో సోనూసూద్ అద‌ర‌గొట్టేశాడు. ఇక‌పోతే ఈ సినిమాకు సోనూసూద్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది. నిజానికి అరుంధతిలో అఘోర పశుపతి పాత్ర చేయడానికి సోనూసూద్ మొదట ఒప్పుకోలేదట. కానీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తపన చూశాక‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఈ మూవీ కోసం శ్యామ్ ప్రసాద్ రెడ్డి 20 రోజులు డేట్స్‌ అడిగితే.. సోనూసూద్ రూ. 18 లక్షలు రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడ‌ట‌. ఒకవేళ రూ. 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా డేట్స్ ఇస్తానని సోనూసూద్ మ‌రో ఆఫ‌ర్ కూడా ఇచ్చాడ‌ట‌.

కానీ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం 20 రోజుల్లో షూట్ పూర్తి చేస్తానని.. రూ. 18 లక్షలకే డీల్ కుదుర్చుకున్నారట. ఒకవేళ 20 రోజుల్లో వర్క్ పూర్తి కాకపోతే.. ఆ తర్వాత వర్క్ చేసిన ప్రతి రోజుకు రూ. 25 వేలు చొప్పున ఇస్తానని చెప్పారట. కట్ చేస్తే 20 రోజుల్లో సోనూసూద్‌ పాత్రకు సంబంధించి షూట్ పూర్తికాలేదు. చివరకు అరుంధతి సినిమాకు సోనూసూద్ వ‌చ్చిన రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా అక్షరాల రూ. 45 లక్షలు. మొత్తానికి రూ. 2 ల‌క్ష‌ల కోసం వెన‌క‌డుగు వేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. ఫైన‌ల్ గా సోనూసూద్ కు రూ. 27 ల‌క్ష‌లు అద‌నంగా పే చేయాల్సి వ‌చ్చింది.