తొలిప్రేమ చిత్రానికి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కెరియర్ లోని క్లాసిక్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది తొలిప్రేమ సినిమా.. ఈ సినిమా ఈనెల 30వ తేదీన రి రిలీజ్ చేయబోతున్నారు.. ఇందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ను నిర్వహించిన చిత్ర బృందం పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు.. ఈ చిత్రాన్ని ఎస్.ఎస్ .సి ఆర్ట్స్ బ్యానర్ పైన జివిజి రాజు నిర్మించారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నిర్మాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా కోసం అందుకున్న రెమ్యూనరేషన్ ని తెలియజేయడం జరిగింది.

A part of 'Toliprema' re-release earnings will go to Pawan Kalyan's 'Raithu Bharosa Yatra'
డైరెక్టర్ కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించారు. ఈ సినిమా 1998లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాతో ఎన్నో అవార్డులు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.. ఈ సినిమా విడుదల 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 30వ తేదీన మళ్లీ ప్రేక్షకుల ముందుకు రీ రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి GVG మాట్లాడుతూ ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.50 కోట్లు తీసుకుంటున్నారు..

తొలిప్రేమ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు.. దీంతో GVG నువ్వు రెమ్యూనరేషన్ ఎలా తీసుకుంటావని నేను పవన్ కళ్యాణ్ ని అడగగా..?నేను మొత్తం ఒకేసారి ఇవ్వాలా లేదా వాయిదాలలో ఇవ్వాలా అని తెలిపారని తెలిపారు. అది నీ ఇష్టం అంటూ తెలియజేశారట పవన్ కళ్యాణ్ ముందుగా అడ్వాన్స్ కింద కాస్త ఇచ్చామని ఆ తర్వాత సినిమా విడుదలైన తర్వాత ఒకేసారి ఇస్తానని చెప్పారని తెలిపారు GVG . ఆ తర్వాత సినిమా పూర్తయిన తర్వాత నెలవారి ఖర్చులకోసం మొత్తం ఇవ్వమని అడిగారట. అలా మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుని ఆయన చేతిలో పెట్టానని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ కు ఎంత ఇచ్చారు అనే విషయాన్ని మాత్రం తెలుపలేదు.