ఆ విషయంలో విజయ్ దేవరకంటే ..రామ్ పోతినేనినే బెటర్.. చేతులెత్తి దండం పెట్టిన తక్కువే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ హీరోలైన రామ్ పోతినేని – విజయ్ దేవరకొండలను సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పోగేసుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండను – రామ్ ఫ్యాన్స్ తిడుతూ ఉంటే ..రామ్ ను విజయ్ దేవరకొండ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనంతటికి కారణం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అని అంటున్నారు జనాలు . 2019 జులై 18న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది . ఈ సినిమాకు పెట్టిన దానికి ఏకంగా 10 రెట్లు లాభాలు అందుకున్నాడు పూరి జగన్నాథ్ అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు పూరి జగన్నధ్ కి లైఫ్ ఇచ్చింది ఈ సినిమానే అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ మొదట అనుకున్న హీరో రామ్ పోతినేని కాదట . విజయ్ దేవరకొండ అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

ఈ స్టోరీని మొదట విజయ్ దేవరకొండకు చెప్పగా.. అప్పట్లో విజయ్ దేవరకొండకు పూరి జగన్నాథ్ పై నమ్మకం లేక..ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. పైగా సినిమా స్టోరీ కూడా కొంచెం టూ మాస్ గా ఉండడంతో సినిమా రిజెక్ట్ చేశారట . అయితే వరుస ఫ్లాపుల్లో ఉన్నా సరే ..రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కోసం ఈ సినిమాను ఒప్పుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ కెరియర్ ఏ రేంజ్ లో మలుపు తిరిగిందో ప్రత్యేకంగా చెప్పాలా..?. దీంతో రామ్ పోతినేని మంచి మనసును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . అయితే విజయ్ దేవరకొండకు హెడ్ వెయిట్ అని .. ఆ కారణంగానే ఆ సినిమాను వదులుకున్నారని ..దేవుడు ఆయన బిహేవియర్ కి లైగ సినిమాతో ఫ్లాప్ చేశారని కొందరు జనాలు ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి రామ్ VS విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్యవార్ హద్దులు దాటుతుంది..!!