నన్ను అలా దారుణంగా మోసం చేశారంటూ షకీలా షాకింగ్ కామెంట్స్..

ఒకప్పటి బోల్డ్ బ్యూటీ షకీలా నార్త్ లోనే కాకుండా సౌత్‌లోనూ అడల్ట్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. గతంలో షకీలా నటించిన రొమాంటిక్ చిత్రాలకు కలెక్షన్లు భారీగా వచ్చేవి. చాలా ఏళ్లు గ్యాప్ తర్వాత ప్రస్తుతం షకీలా తమిళ రియాల్టీ షో అయిన ‘కుక్ విత్ కోమలి ‘ షోతో బుల్లితెరపై దర్శనం ఇచ్చింది. ఈ షోకి మంచి స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా కొన్ని విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గతంలో ఆమె ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

90’s కాలం నుంచి ఆ తరువాత 15 ఏళ్ల వరకు షకీలా కెరీర్ ఒక రేంజ్‌లో కొనసాగింది. ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని అనుకున్న షకీలా ఎలాంటి సినిమాలో నటించినప్పటికీ భారీగా ఓపెనింగ్స్ వచ్చేవి. మలయాళంలో ఆమె నటించిన బి గ్రేడ్ రొమాంటిక్ సినిమాల వల్ల చాలామంది నిర్మాతలు లాభాలు పొంది సెటిల్ అయ్యారు. అలానే షకీలా కూడా మంచి రెమ్యూనరేషన్ అందుకుంటూ తన ఫ్యామిలీని ఒక స్థాయిలో నిలబెట్టింది. కానీ కొంతకాలానికి ఆస్తి లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు కూడా ఆమెకి సపోర్ట్ చేయలేదు. అయితే ఇటీవల ఆమెకు లగ్జరీ ఫ్లాట్స్, బీఎండబ్ల్యూ కార్ ఉందని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆమె ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

ప్రస్తుతం తన దగ్గర ఎటువంటి ఆస్తిపాస్తులు లేవంటూ, ఇప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లు షకీలా చెప్పారు. కుటుంబం సభ్యులే ఆమెని ఘోరంగా మోసం చేసారని తెలిపారు. తనపై ఐటీ దాడులు జరుగుతాయాని ఆమెని భయపెట్టి తన సోదరి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం దోచుకుందని ఈమె వాపోయింది. ఒకప్పుడు షకీలా రోజుకి రూ.4 లక్షలు సంపాదించేవారట. ఆ డబ్బు మొత్తం తన సోదరి తీసుకుని షకీలాకు ఏమి లేకుండా చేసిందట. అలానే గతంలో షకీలా నటించిన సినిమాలను రిలీజ్ కాకుండా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రయత్నించే వారని షకీలా ఇంటర్వ్యూలో వివరించారు. షకీలా నటించిన సినిమాలు సూపర్ స్టార్ల సినిమాలకు పోటీగా నిలిచేవట. అందుకే షకీలా పై మమ్ముట్టి ఎప్పుడు కోపంగా ఉండేవారని షకీలా తెలిపారు.