ఎర్ర చీర‌లో హొయ‌లు పోతున్న ఈషా రెబ్బ‌.. అంద‌రి చూపులు అక్క‌డే!

ఇషా రెబ్బ.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అందం, అభిన‌యం అంత‌కు మించిన న‌ట‌నా ప్ర‌తిభ ఉన్నా.. తెలుగమ్మాయి కావ‌డం వ‌ల్ల ఆమెకు టాలీవుడ్ లో హీరోయిన్ గా అవ‌కాశాలు ద‌క్క‌లేదు.

అంతకు ముందు.. ఆ తరువాత.., బందిపోటు, అమి తుమి, యామ మాల్ వంటి చిన్న చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించినా పెద్ద‌గా క్లిక్ కాలేక‌పోయింది.

ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ కొన‌సాగిస్తున్న ఈషా.. సోష‌ల్ మీడియాలో మాత్రం సూప‌ర్ యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటో షూట్లతో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది.

తాజాగా ఎర్ర చీర‌లో అందంగా ముస్తాబై హొయ‌లు పోయింది. ఆక‌ట్టుకునే అందంతో అంద‌రి మ‌తులు పోగొట్టింది. అంద‌రి చూపులు క‌నీక‌నిపించ‌ని త‌న న‌డుము వైపే వెళ్లాలా చేసింది.

ప్ర‌స్తుతం ఈషా రెబ్బ తాజా ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈషా అందాన్ని నెటిజ‌న్లు తెగ పొగిడేస్తూ.. లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.