రాజమౌళి సినిమా కోసం మహేశ్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. కెరీర్ లోనే ఇది ఓ రికార్డ్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈగర్ గా అభిమానులు వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఒకటి మహేష్ బాబు – రాజమౌళి కాంబోలు తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమాపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు . ఒక్కటంటే ఒక్క టీజర్.. ఫస్ట్ లుక్.. ఏది కూడా రివీల్ చేయలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం .. ఈ సినిమాకి సంబంధించి హ్యూజ్ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ జరుగుతుంది . మరి ముఖ్యంగా ఈ సినిమా పై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది .

పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు కనీ విని ఎరుగని లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు ఇప్పటివరకు మనం మహేష్ బాబును చూసింది మహా అయితే క్లాస్ ..మహా మాస్..అయితే ఓ డిఫరెంట్ యాక్షన్ జోనర్ లో మహేష్ బాబు ఎలా ఉంటారు అని రాజమౌళి ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారట . ఈ సినిమా మొత్తం షూటింగ్ అడవుల్లోనే జరగబోతుందని ..దానికోసం సపరేట్ డైట్ కూడా మహేష్ బాబు ఫాలో అవుతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే మహేష్ – రాజమౌళి సినిమా కోసం ఏకంగా 100 కోట్లు చార్జ్ చేశాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు మహేష్ బాబు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయలేదు. . అయినా సరే పాపులారిటీ క్రేజ్ పరంగా చూసుకుంటే హీరోలకి మన హీరో ఏం తక్కువ కాదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయన 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు అన్న న్యూస్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం మహేష్ కెరియర్ లోనే ఇది కనీ విని ఎరుగని రికార్డ్ అని చెప్పాలి. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??