టీల్లు -2 లో ముద్దులతో రెచ్చిపోతున్న అనుపమ.. రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు పొందిన సిద్దు జొన్నలగడ్డ మొదట గుంటూరు టాకీస్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి డిజే టిల్లు చిత్రంతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించారు సిద్దు.. ఈ చిత్రంలోని డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు ఈ సినిమాతో మంచి క్రేజీ సంపాదించారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఈ సినిమా సీక్వెల్ పైన ఫోకస్ చేయడం జరిగింది.

దీంతో డీజే టిల్లు చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ విమల కృష్ణ దర్శకత్వం వహించగా ఈ సినిమా సీక్వెల్ కి మాత్రం మల్లిక్ రాం దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి పార్ట్ లో హీరోకి జోడిగా నేహా శెట్టి నటించగా సీక్వెల్లో మాత్రం హీరోయిన్ అనుపమా అని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజున రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ గతంలో ఈ సినిమా ఆగస్టు 11న విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం ఆరోజు చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదల అవుతున్న కారణం చేత ఈ సినిమా తేదీని మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

సెప్టెంబర్ 15వ తేదీన డీజే టిల్లు -2 చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా సెలవులను క్యాష్ చేసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తూ ఇలా విడుదల చేసినట్టు తెలుస్తోంది. డిజె టిల్లు సినిమా ప్రభావం అందరి పైన బాగానే ఉంది.ముఖ్యంగా ఇందులోని పంచు డైలాగ్ లు ప్రేక్షకులను నవ్వించే విధంగా ఉన్నాయి దీంతో ఈ సినిమా సీక్వెల్ పైన మంచి బజ్ ఏర్పడుతోంది. ఈ సినిమా పోస్టర్ విషయానికి వస్తే అనుపమ సిద్దు కారులో కూర్చొని సిద్దు లిప్స్ మీద చేయి పెట్టి మరి అడ్డుపెడుతున్నట్టుగా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Siddhu Jonnalagadda (@siddu_buoy)