స్నేహా రెడ్డిని కాకుంటే అల్లు అర్జున్..ఆ అమ్మాయేనే పెళ్ళి చేసుకునేవాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . గంగోత్రి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఫస్ట్ సినిమాతోనే తనలోని నటన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు . చిన్నవయసులోనే తనలో నటించే సత్తా ఉంది అంటూ తన స్టామినాను బయటపెట్టారు. ఆ తర్వాత తనదైన స్టైల్ లో హిట్లు ప్లాపులు అంటూ సంబంధం లేకుండా వరుస గా సినిమాలకి కమిట్ అవుతూ క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ .. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్.. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు .

ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా పుష్ప1. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసేసింది. ప్రజెంట్ పుష్ప 2 తో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవాలని ఉన్నాడు బన్నీ. అయితే ఇలాంటి క్రమంలోనే బన్నికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే బన్నీ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.

అప్పట్లో వీళ్ళ పెళ్లి ఓ సెన్సేషన్ గా మారింది . అయితే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిని చూడకుండా ఉన్నా.. ఆమెను ప్రేమించకుండా ఉన్నా.. ఆయన తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడని ఓ న్యుస్ వైరల్ అవుతుంది. మొదటి నుంచి అల్లు అర్జున్ ని తన బంధువుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని .. వాళ్ళ అమ్మగారు అనుకున్నారట. బన్నీ లైఫ్లో సెటిల్ అయ్యాక .. ఇదే విషయాన్ని అబ్బాయికి చెప్పి గ్రాండ్గా పెళ్లి చేయాలనుకున్నారట . అయితే ఈలోపే బన్ని తొందరపడి స్నేహారెడ్డిని చూడడం .. ఆమెను ప్రేమలో పడేయడం .. ఆయన ప్రేమలో పడిపోవడంతో.. బన్నీ భార్యగా స్నేహ రెడ్డి సెటిల్ అవ్వాల్సి వచ్చింది . లేకపోతే కచ్చితంగా బన్నీ భార్య ప్లేస్ లో బన్నీ వాళ్ళ అమ్మగారు అనుకున్న అమ్మాయి ఉండేవారట ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!