ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి గ్లోబల్ హీరోయిన్..!!

గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. ఈ జోస్ లోనే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేవర సినిమాతో పాటే జూనియర్ ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

NTR To Romance With Priyanka Chopra | cinejosh.com
అయితే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్నా ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడిగా హీరోయిన్గా ఎవరన్న విషయంపై పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆలియా భట్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే వంటి హీరోయిన్లు సైతం పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక విషయం వైరల్ గా మారుతోంది.

ఇందులో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు ప్రశాంత్ నీల్ స్టోరీ కూడా వినిపించారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో కూడా భాగమయ్య అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.