ప్రొద్దుటూరులో లోకేష్ సంచలనం..టీడీపీకి అడ్వాంటేజ్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రతో వెళుతూ ప్రజలని కలుస్తున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు ప్రజల మద్ధతు బాగానే వస్తుంది. అలాగే లోకేష్ సభలకు జనం బాగానే వస్తున్నారు. దీంతో ప్రజల్లో లోకేష్ బలం పెరిగినట్లే కనిపిస్తుంది. ఇక లోకేష్ పాదయాత్ర వల్ల టి‌డి‌పికి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఆ పార్టీకి బలం పెరుగుతుంది. అయితే తాజాగా లోకేష్ పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది.

అక్కడ లోకేష్ పాదయాత్రకు వైసీపీ ఇబ్బందులు పెట్టే విధంగా ముందుకెళ్లింది. ఇదే క్రమంలో వివేకా మర్డర్‌కు సంబంధించిన ప్లకార్డులు పెట్టుకుని టి‌డి‌పి శ్రేణులు వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి చూశాయి. ఈ క్రమంలో పోలీసులు ఆ ప్లకార్డులు తీసేయాలని వాదించాయి. కానీ పోలీసులపై రివర్స్ అయిన లోకేష్..ఆ ప్లకార్డులని తానే స్వయంగా ప్రదర్శించారు. దీంతో ఆయన దూకుడు ఎలా ఉందో అర్ధమైంది. ఇక  బాబాయిని ఇద్దరు అబ్బాయిలు వేసేశారని, గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారని,  సొంత పత్రిక, టీవీలో నారాసుర రక్తచరిత్ర అంటూ రాసుకున్నారని, హూ కిల్డ్‌ బాబాయ్‌? బాబాయిని ఎవరు చంపారు..? అబ్బాయిలే వేసేశారని సీబీఐ తేల్చిందని లోకేష్ విమర్శలు చేశారు.

గత ఎన్నికల్లో కడపలో 10కి 10 సీట్లు, 2 ఎంపీ సీట్లు వైసీపీకి ఇచ్చారని, కానీ కడపకు వైసీపీ చేసింది ఏమి లేదని, అదే తమని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ చెప్పారు. అలాగే ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి కింద రూ.18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1,500 చొప్పున 5 ఏళ్లకు రూ.90 వేలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15వేలు, దీపం పథకంలో ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని,  టీడీపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల మందికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు. రైతులకు ఏటా 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి లోకేష్ టీడీపీకి అడ్వాంటేజ్ తెచ్చేలా ముందుకెళుతున్నారు.