ఓరి దేవుడోయ్.. ఎక్కువ డబ్బుల కోసం..తమన్ అలాంటి చీప్ పనులు కూడా చేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవానే కొనసాగుతుంది . ఏ హీరో అయినా సరే డ్రం వాయించాల్సింది తమన్ అంటూ పట్టుబట్టి మరీ స్టార్ హీరోలు కూడా ఆయన్ని తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా చేయమని ఫోర్స్ చేస్తున్నారు . దానికి కారణం ఈ మధ్యకాలంలో తమన్ చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వడం.. మరి ముఖ్యంగా వంద కోట్లు క్రాస్ చేసి భారీ బ్లాక్ బస్టర్ రికార్డులు నెలకొల్పడమే అంటూ తెలుస్తుంది . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో తమన్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేసేస్తున్నారు కుర్రాళ్ళు .

తమన్ మొదటి నుంచి తమను కాపీ రాజా అన్న పేరును సంపాదించుకున్న విషయం తెలిసిందే . కాగా రీసెంట్గా మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమాకి బిజిఎం మ్యూజిక్ ఇచ్చింది తమన్ నే. అంతేకాదు బాలయ్య నటిస్తున్న “భగవంత్ కేసరి ” సినిమాకు బ్యాక్ గ్రౌండ్ ఇచ్చింది తమన్ నే. ఈ రెండు మ్యూజిక్స్ ని కంపేర్ చేస్తే రెండు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసింది ఒక డైరెక్టరేనా అంటూ ఆశ్చర్యపోవాలి . అంతలా వేరియేషన్స్ ఉన్నాయి . ఇదే పాయింట్ ని క్యాచ్ చేసుకున్నారు మహేష్ బాబు అభిమానులు.

దీంతో సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు తమన్ ని. డబ్బులు ఇస్తే నచ్చిన హీరోలకి బాగా మ్యూజిక్ ఇస్తాడని.. మిగతా హీరోలకు తన అసిస్టెంట్ దగ్గర చేయిస్తారని .. అందుకే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మ్యూజిక్ అంత దరిద్రంగా ఉందని… అదే బాలయ్యే సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్ డూపర్ గా పూనకాలు తెప్పించే విధంగా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు తమన్ డబ్బుకు ఆశ పడే ఇలా చేస్తున్నాడని స్టార్ హీరోలు బడా హీరోలు అయితే ఎక్కువ డబ్బులు ఇస్తారు .. అని ఆ కారణంగానే అసిస్టెంట్ దగ్గర కొందరు హీరోలకి మ్యూజిక్ కొట్టిస్తూ స్టార్స్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ కోసమే మ్యూజిక్ వాయించుతున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి తమన్ పేరు వైరల్ గా మారింది..!!