పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి క్రేజీ లీక్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగు చిత్రాలతో చాలా బిజీగా దూసుకుపోతున్నారు. ఒకటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా సాగకపోయినా ఈ గ్యాప్ లో ఆయన ఓజీ, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక తన కెరియర్ లోనే మొదటిసారి ఆయన ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం.. ఇంతటి బిజీగా ఉండడం ఇదేమో కొత్త ఏమీ కాదు.. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమాలతో వరుసగా బిజీ అవుతుంటారు. కానీ ఈసారి ఆశ్చర్యం ఏమిటంటే వచ్చే ఎన్నికలలోపు ఎలాగైనా పార్టీని నిలబెట్టుకోవాలన్న తపన.. ఒకవైపు ఎన్నికలలోపే సినిమాలు పూర్తి చేసి రిలీజ్ కావాలనేది ఆయన టార్గెట్.. అందుకే విశ్రాంతి లేకుండా షూటింగ్లకు హాజరవుతూనే ఉన్నారు.

ఇకపోతే బాలు, పంజా వంటి చిత్రాల తర్వాత పవన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా చేస్తున్నారు. సుజిత్ దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ఫేమ్ అర్జున్ దాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తాజాగా శనివారం ఆయన ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సెట్లోకి అడుగుపెట్టడం జరిగింది. రెండు రోజుల క్రితం పవన్ ఈ సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ లీక్ నెట్టింట చక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమా కథకి కొరియన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది.

పవన్ కళ్యాణ్ ఎలాగో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈ సినిమాలో ఆయన యాక్షన్ సన్నివేషాలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోబోతున్నాయట. అంతేకాదు ఇందులో ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ ఎపిసోడ్లు కూడా ప్లాన్ చేశారట దర్శకుడు. ఇక 1950లో జరిగే కథ అని లీకైన పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అదిరిపోతుందని.. పవన్ పాత్ర చాలా సీరియస్ గా సాగుతుందని చెబుతున్నారు.