అనుప‌మ‌ అందుకు పనికిరాదా..? ఓపెన్ గానే చెప్పేసిందిగా.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ని ఎలా టార్గెట్ గా చేసి ట్రోల్ చేస్తున్నారో జనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలని మెయిన్ టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు హీరోయిన్స్ ని నానా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా మరోసారి అలాంటి బోల్డ్ కామెంట్స్ ధాటికి బలి అవ్వాల్సి వచ్చింది అనుపమ పరమేశ్వరన్ .

మలయాళీ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వర్ణ్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా హ్యాట్రిక్ హిట్లను అందుకొని సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారిపోయింది. అయినా ఎన్ని హిట్లు కొట్టిన సరే అనుపమ పరమేశ్వరన్ కి స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వట్లేదు . అది ఎందుకు అంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది . అయితే రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అనుపమ పరమేశ్వరణ్ ని డైరెక్ట్ గా ఇదే విధంగా అడిగేసారు .

“నువ్వు పెద్ద హీరోయిన్ ఏమీ కాదు . అందుకే నీకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు . అసలు నువ్వు హీరోయిన్ మెటీరియల్ ఏ కాదు ” అంటూ చాలా ఘాటుగా బోల్డ్ గా కామెంట్ చేశారు . అయితే ఈ కామెంట్స్ ని ఏం మాత్రం సీరియస్ గా తీసుకొని అనుపమ చాలా కూల్ అండ్ క్లాసిక్ గా సింపుల్ లైన్ తో రిప్లై ఇచ్చింది . “కరెక్ట్ అన్న నేను హీరోయిన్ టైప్ కానే కాదు.. యాక్టర్ టైప్ ” అంటూ అనుపమ పరమేశ్వరన్ అతగాడికి ఘాటుగా రిప్లై ఇచ్చింది . దీనితో ఈ మేటర్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ పేరు వైరల్ గా మారింది..!!