నాలుగోసారి తండ్రైన ప్రభుదేవా?..యాభై ఏళ్ల వయసులోను.. తగ్గేదేలే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చూడకూడనివి చూస్తున్నాం ..విన కూడనివి వింటున్నాం అంటూ జనాలు ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా నటుడు గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా తండ్రి అయిన విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్ ఈ విషయంపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేనప్పటికీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త మారుమ్రోగిపోతుంది.

మనకు తెలిసిందే ప్రభుదేవా మొదటి భార్య రామలతకు 2011లో విడాకులు ఇచ్చేశారు . వీరికి ముగ్గురు సంతానం . కాగ పెద్దబ్బాయి క్యాన్సర్ తో మరణించాడు . ఆ తర్వాత నయనతారతో డేటింగ్ అంటూ ప్రభుదేవా భార్య నుంచి విడాకులు కోరుకున్నారు . అప్పట్లో ఈ విషయం ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యిందో మనకు తెలిసిందే. కాగా ఆ తర్వాత నయనతారతో కూడా ప్రభుదేవా బ్రేకప్ చెప్పేసుకున్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న ప్రభుదేవా 2020 లో డాక్టర్ హిమాసింగ్ ను నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు . రీసెంట్ గానే వీళ్ళ వివాహానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . ప్రభుదేవా రెండో భార్య గురించి తెలిసింది చాలా తక్కువ . ప్రభుదేవా 50వ బర్తడేను హిమాని సింగ్ ప్రత్యేకంగా జరిపారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు అప్పుడే హిమానింగ్ సింగ్ వెలుగులోకి వచ్చింది. అయితే హిమాని సింగ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారట . ఇదే న్యూస్ ఇప్పుడు చిత్ర వర్గాలల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేదు కానీ ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు అన్న వార్త ఓ రేంజ్ లో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!