బాలినేనికి సొంత తలనొప్పి..వదలడం లేదట..ఒంగోలులో దెబ్బతీస్తారా?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సొంత తలనొప్పి తగ్గడం లేదు. సొంత వాళ్ళే ఆయనకు డ్యామేజ్ చేస్తున్నారట. కుట్రలు పన్నుతున్నారట. దీంతో బాలినేని..డైరక్ట్ గా జగన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. చాలా రోజుల నుంచి బాలినేని ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత వాళ్లతోనే ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. తనకు కావాలని డ్యామేజ్ చేస్తున్నారని, తనకు ప్రాధాన్యత దక్కకుండా చూడాలని చూస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో ఆ మధ్య ప్రాంతీయ సమన్వయకర్త పోస్టుకు సైతం రాజీనామా చేశారు. ఇక దీనిపై జగన్ డైరక్ట్ బాలినేనిని బుజ్జగించారు..మళ్ళీ పదవి చేపట్టాలని కోరారు. అయినా సరే బాలినేని వెనక్కి తగ్గలేదు. పదవి తీసుకోలేదు. కేవలం ఒంగోలు ఇంచార్జ్ గానే కొనసాగుతానని చెప్పి వచ్చేశారు. అలాగే తన నియోజకవర్గ పరిధిలోనే పనిచేసుకుంటున్నారు. అయినా సరే ఆయనపై సొంత నేతలు కుట్రలు ఆపడం లేదట. ఓ ఇద్దరు నేతలు తనని టార్గెట్ చేసుకుని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. వారిపైనే పోరాడుతున్నానని, జగన్ తో వారి పైనే ఫిర్యాదు చేశానని, మళ్ళీ పదవి తీసుకోవడంపై

చర్చ జరగలేదని బాలినేని చెప్పుకొచ్చారు. అయితే బాలినేనిని ఇబ్బంది పెట్టే నేతలు ఎవరనే చర్చ ఎప్పటినుంచో సాగుతుంది. అందులో ముఖ్యంగా తన బావ వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి పొసగడం లేదు. వీరి ఇద్దరి వర్గాల మధ్య పోరు నడుస్తుంది.

సుబ్బారెడ్డి వర్గమే బాలినేనిని ఇబ్బంది పెడుతుందనే ప్రచారం ఉంది. వారే ఒంగోలులో బాలినేనికి డ్యామేజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే బాలినేని..జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ఒంగోలులో ప్రస్తుతం బాలినేని పరిస్తితి మెరుగుగా ఉన్నట్లు కనిపించడం లేదు. అక్కడ టి‌డి‌పి బలపడుతుంది. కొద్దో గొప్పో జనసేనకు ఓటు బ్యాంకు ఉంది. ఆ రెండు పార్టీలు కలిస్తే బాలినేనికి కాస్త ఇబ్బంది.