అది ఉన్న‌వాడినే పెళ్లి చేసుకుంటానంటున్న అంజ‌లి.. ఇక అయ్యే ప‌నే!?

అంజలి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి మొదట తమిళంలో మంచి క్రేజ్‌ సంపాదించుకొంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా అంజలికి తెలుగులో భారీ పాపులారిటీ దక్కింది. అయితే స్టార్ హీరోలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న అంజలి.. ఇటీవల అర్ధ సెంచురీ సినిమాలను సైతం పూర్తి చేసుకుంది.

ఈ సంగతి పక్కన పెడితే.. వయసు నాలుగు పదులకు చేరువ‌వుతున్న అంజలి పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. అంజలి ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని అభిమానులు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. గతంలో హీరో జయ్ తో ప్రేమలో పడి కొన్నాళ్లు సహజీవనం చేసింది. ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి జోలుకి వెళ్లడం లేదు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో వివరించింది.

రిలేషన్షిప్ లో రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమని అంజలి పేర్కొంది. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలని.. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అని అంజలి చెప్పుకొచ్చింది. త‌న‌కు రెస్పెక్ట్ ఇవ్వాలి, త‌న వృత్తిని గౌరవించాలి.. ఈ క్వాలిటీ ఉన్న వాడినే పెళ్లి చేసుకుంటాన‌ని అంజ‌లి కుండ‌బద్దలు కొట్టేసింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మ‌ర‌గా.. నెటిజ‌న్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అలాంటి వ్యక్తి మీకు త్వరలోనే దొరుకుతాడని అంటుంటే.. మరి కొందరు ఇక ఇది అయ్యే ప‌నే.. వయసు దాటి పోతోంది ఎవరో ఒకరిని చూసుకుని పెళ్లి చేసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.