రీ రిలీజ్ సినిమా విషయంలో బాలయ్యకు గోరా అవమానం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటివరకు ఒకే యాసలో నటించిన తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా ఈ సినిమాతో దిశను మార్చేసిందని చెప్పవచ్చు. ఇందులోని కొన్ని సన్నివేశాలు ఎన్ని తరాల ప్రేక్షకుల చూసిన సరే ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య అద్భుతంగా నటించారు.

All-Time Industry Hit Narasimha Naidu re- releasing on Balakrishna's  Birthday - TrackTollywood
నందమూరి ఫ్యాన్స్ నే కాకుండా ఇతర హీరోల అభిమానులను సైతం ఎంతగానో మెప్పించింది ఈ చిత్రం. అప్పట్లో ఈ సినిమా రూ.20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టి.. సరికొత్త రికార్డు సృష్టించింది. ఇవే కాకుండా దాదాపుగా వందకి పైగా కేంద్రాలలో వంద రోజులు జరుపుకుందట. ఇలాంటి సినిమాని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా 4k విజువల్స్ తో రీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా రెస్పాన్స్ ఒక రేంజ్ లో వస్తుందని బాలయ్య అభిమానులు భావించారు కానీ ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది

ఈ సినిమా రిమాస్టర్ చేయడానికి ఖర్చు అక్షరాలరూ .20 లక్షల రూపాయలు అయ్యిందట.. అయితే క్వాలిటీ కూడా బాగుందని ఈ సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. కానీ మొదటి రోజు ఈ సినిమా గ్రాఫ్ రూ .20 లక్షల రూపాయల లోపు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి సరికొత్త మార్గాన్ని చూపించిన ఈ సినిమాకు ఇంత తక్కువ కలెక్షన్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. దీంతో రీ రిలీజ్ సినిమాలలో బాలయ్యకు దెబ్బ పడిందని చెప్పవచ్చు. కానీ గత ఏడాది చెన్నకేశవరెడ్డి సినిమా అని రిలీజ్ చేయగా పర్వాలేదు అనిపించుకుంది..ఈ ఏడాది మాత్రం నరసింహనాయుడు సినిమాతో బాలయ్యకు చేదు అనుభవం మిగిలిందని చెప్పవచ్చు.