ఈగ -2 చిత్రం నుంచి అప్డేట్.. ఏమిటంటే..?

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఈగ.. ఈ సినిమా చివరిలో సీక్వెల్ కూడా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎప్పటినుంచో రాజమౌళి ఈ సినిమా సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు.. మహేష్ బాబుతో సినిమా పూర్తయ్యాక ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. అయితే ఈగ సినిమా సమయంలో రాజమౌళి క్రేజ్ వేరే లెవల్లో ఉండేది.. కానీ ఇప్పుడు ఈగ-2 తీస్తే అది హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

SS Rajamouli retrospective: Eega – a housefly's fascinating revenge |  Entertainment News,The Indian Express
ముఖ్యంగా ఈగ-2 చిత్రంలో కాస్ట్ ఎవరెవరు ఉంటారని విషయంపై అంచనా వేయడం జరుగుతుంది. గతంలో ఈగ సినిమాలో నాని ,సమంత నటించారు.. ఈగ-2 సినిమా తీస్తే వీరిద్దరూ ఆ సినిమాలో ఉండే ఛాన్స్ లేకపోవచ్చట. సమంత తన పందాలో తాను సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది.. ఒకప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు లేదని సమాచారం.. నాని కూడా తన మార్కు సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఈగ-2 చేస్తే నాని సమంత నటిస్తారా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న..

ఈగ-2 సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు తో సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా నెక్స్ట్ సెట్స్ మీదికి వెళ్లి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈగ సినిమాలో కిచ్చా సుదీప్ కూడా నటించడం జరిగింది. మరి ఈగ -2 సినిమాలు విలన్ గా ఎవరిని తీసుకుంటారు అనే విషయం కూడా సందిగ్ధంగా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో రాజమౌళి ఈ సినిమా అప్డేట్ గురించి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి మరి.