పూర్తిగా మారిపోయిన సింగర్ సునీత లైఫ్.. కారణం అదేనా

సింగర్ సునీత ఉపద్రష్ట గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె 25 ఏళ్ల విజయవంతమైన కెరీర్‌లో ఎన్నో మధురమైన పాటల ద్వారా లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. శ్రోతలను కట్టిపడేసే గాత్రంతో పాటు చూపు తిప్పుకోనివ్వని అందం సింగర్ సునీత సొంతం. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటున్న ఆమె జీవితం 2020 లాక్ డౌన్ సమయంలో మరో మలుపు తిరిగింది. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో ఆమె పరిచయం పెళ్లికి దారి తీసింది. తొలుత రామ్ ప్రపోజ్ చేయడం, తర్వాత ఆమె పిల్లలు కూడా తల్లి రెండో పెళ్లికి ఓకే చెప్పడంతో వారి పెళ్లి జరిగిపోయింది. మొదటి భర్త ద్వారా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఆమెకు రెండో భర్త వద్ద ఎంతో ప్రేమ దొరుకుతోంది. దీనికి కారణం ఆమె ముఖంలో కనిపిస్తున్న సంతోషం.

ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సింగర్ సునీత తన లైఫ్ కొనసాగిస్తున్నారు. 42 ఏళ్ల ఈ సింగర్‌ రెండో పెళ్లి చేసుకోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే పిల్లలు, ఆమె అభిమానులు, సన్నిహితులు సునీతకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం సునీతకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. కుమారుడు ఆకాష్ త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా రామ్ వీరపనేని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సింగర్ సునీత అమెరికాలో పర్యటిస్తున్నారు. కుమార్తెను చూసేందుకు అక్కడికి వెళ్లారు.

అక్కడ మంచుకు విరబూసిన పువ్వుల వద్ద ఫొటోలు దిగి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. అంతేకాకుండా అమెరికాలో నిర్వహిస్తున్న తెలుగు మ్యూజికల్ కాన్సెర్ట్ లలో ఆమె పాల్గొంటున్నారు. ఏదేమైనా మొదటి పెళ్లి వల్ల ఆమె జీవితంలో ఏర్పడిన గాయం రెండో పెళ్లితో మాయమైందని చెప్పొచ్చు. రెండో భర్త వద్ద ఆమె దొరికిన ప్రేమ ఆమె జీవితాన్ని సంతోషమయం చేసింది.

Share post:

Latest