తొలిసారి బేబీ బంప్ ను రివీల్ చేసిన ఇలియానా.. వైర‌ల్ గా మారిన తాజా పోస్ట్‌!

దేవదాసు మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా.. తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చి అక్క‌డ‌ కూడా సత్తా చాటాలని భావించింది. కానీ బాలీవుడ్ లో ఇలియానా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇలియానా ఇటీవల తాను తల్లి కాబోతున్నానని అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ పోస్ట్ పెట్టి బిగ్ బాంబ్ పేల్చింది. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. పెళ్లి కాకుండానే తల్లి కావడమేంటి..? నెటిజన్స్ విమ‌ర్శ‌లు కురిపిస్తే.. సినిమా ప్రమోషన్స్ కోసం కొత్త ట్రెండ్ అన్నారు ఫ్యాన్స్. అయితే ఇలియానా తొలిసారి బేబీ బంప్ ను రివీల్ చేసి ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చింది.

ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఓ వీడియోను పంచుకుంది. చేతిలో కాఫీ కప్ పట్టుకుని సేదతీరుతున్నట్లుగా ఉన్న ఈ వీడియోను.. ఇలియానా త‌న బేబీని బాగా ఎలివేట్ చేసింది. దీంతో ఆమె నిజంగా గ‌ర్భం దాల్చింద‌ని అంద‌రికీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కానీ, ఆమెకు పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి ఎవ‌రు అన్న‌ది మాత్రం తేల‌డం లేదు. కాగా, ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసింది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు 2019లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమలో ఉందని వార్తలు వ‌చ్చాయి.

Share post:

Latest