అదే నా స‌క్సెస్ సీక్రెట్ అంటున్న సంయుక్త‌.. దాన్ని అస్స‌లు న‌మ్మ‌ద‌ట‌!!

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. బీమ్లా నాయ‌క్‌ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఈ అందాల సోయగం.. తొలి మూవీ తోనే బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సంయుక్త నటించిన సార్, బింబిసార చిత్రాలు కూడా ఘ‌న విజ‌యం సాధించాయి.

రీసెంట్గా ఈ బ్యూటీ `విరూపాక్ష‌` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ హీరోగా తెర‌కెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. టాలీవుడ్ లో కెరీర్‌ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తూ లక్కీ బ్యూటీగా మారిన సంయుక్తకు.. ప్రస్తుతం ఆఫర్లు క్యూ కడుతున్నాయి. యంగ్‌ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా సంయుక్త తో నటించేందుకు మ‌క్కువ చూపుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సంయుక్త తన సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేసింది. సినీ ప్రియులంద‌రూ లక్కీ బ్యూటీ అని కొనియాడుతుంటే.. సంయుక్త మాత్రం తాను ల‌క్ ను అస్స‌లు న‌మ్మ‌నంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. నేను లక్ ని నమ్మను, అదే సక్సెస్ సీక్రెట్ అని సంయుక్త పేర్కొంది. విజయం అనేది టాలెంట్, స్క్రిప్ట్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంద‌ని, ల‌క్ వ‌ల్ల విజ‌యాలు వ‌రిస్తాయ‌ని తాను న‌మ్మ‌ను అంటూ సంయుక్త పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest