ఎన్టీఆర్ కోసం ఏకమవుతున్న టాలీవుడ్.. ఆ స్టార్ హీరోలు కూడా….!

ఈనెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గత నెల రోజుల నుంచి శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఈ సమయంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నందమూరి అభిమానులు, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు హైదరాబాదులోని కేపీహెచ్బి గ్రౌండ్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

N. T. Rama Rao | Sr NTR's birthday anniversary: A flashback of his film and political foray

ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. వీరీతోపాటు నందమూరి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారు. ఇక ఈ విషయం ఇలా ఉంచితే ఈ శత జయంతి వేడుకలకు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరినీ ఆహ్వానించారట. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరకు అందర్నీ ఆహ్వానించారట. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తప్ప మిగిలిన యంగ్ హీరోలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.

Here are the most educated Tollywood Heroes - TeluguBulletin.com

ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీరందరూ ఒకే వేదికపై వచ్చి మహా పురుషుడికి నివాళులర్పించబోతున్నారు. తెలుగువారు గర్వించదగ్గ నట సార్వభౌముడి వందేళ్ళ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖులు పాల్గొనడం ద్వారా ఎన్టీఆర్ కి ఘన నివాళిళ్లు ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహించగా ఆ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చారు.

Nandamuri Kalyan Ram opens up on differences between Balakrishna and Jr NTR - IBTimes India

ఇక మరి ఈ తారక రాముని శత జయంతి ఉత్సవాల ద్వారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ ని దగ్గరికి తీసుకుంటారా, అలాగే టిడిపి అధినేత చంద్రబాబు కూడా తారక్ ని ఏ మేర రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఇక రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావటం అదే రోజు శత జయంతి వేడుకలు సీనియర్ ఎన్టీఆర్‌కి నిర్వహించడం మరో విశేషం అనే చెప్పాలి. ఇక మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి.

Share post:

Latest