సినిమా ఈవెంట్లలో చాలా మంది నటీనటులు వేసుకునే దుస్తులు చాలా బాగుంటాయి. వెరైటీ డ్రెస్‌లతో అలరిస్తుంటారు. వాటిని చూడగానే ప్రేక్షకులు తాము కూడా అలాంటి డ్రెస్ లు వేసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఒక్కోసారి నటీనటులు ధరించే దుస్తులు ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇవేం డ్రెస్సులు రా నాయనా అని ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటారు. తాజాగా ఇదే తరహాలో మెగా డాటర్ నిహారిక ఇటీవల ఓ ఈవెంట్‌లో ధరించిన డ్రెస్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఆమె డ్రెస్ బాగుందని కొందరు, వెరైటీగా ఉందని మరికొందరు, ఇదేం డ్రెస్ అని ఇంకొందరు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నిహారిక పెళ్లి వెంకట చైతన్యతో జరిగింది. అయితే కొన్నాళ్లుగా వీరు విడిపోతున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదే తరుణంలో ఇరువురూ తమ సోషల్ మీడియా ఖాతాలలో పెళ్లి ఫొటోలను తొలగించడం ఆ వార్తలకు ఊపందించింది. ఇక ఇటీవల కాలంలో ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించింది. వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలలో నటించేందుకు ఉత్సాహం చూపుతోంది. ఇదే కోవలో డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇది ప్రస్తుతం 5 భాషలలో యూజర్లకు అందుబాటులో ఉంది.
వైవా హర్ష, భావన, అక్షయ్ తదితరులు నటించారు. ఇందులో నిహారిక కీలక పాత్ర పోషించింది. దీనికి సంబంధించిన ఈవెంట్‌కు ఆమె వెరైటీ డ్రెస్ ధరించి హాజరైంది. ముఖ్యంగా ఆ చొక్కా బాగోలేదని చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ నిహారిక కీలక వ్యాఖ్యలు చేసింది. సుమారు నాలుగేళ్ల తర్వాత తిరిగి వెబ్ సిరీస్‌లో నటించినట్లు తెలిపింది. డైరెక్టర్ ఆదిత్య తనపై నమ్మకముంచి కీలక పాత్రలో నటింపజేశారని పేర్కొంది. ఇందులో తాను పోషించిన గాయత్రి పాత్ర తనను బాగా ఆకట్టుకుందన్నారు.
డెడ్ పిక్సెల్ వెబ్‌సిరీస్ ఈవెంట్‌లో సరికొత్త చొక్కాలో నిహారిక దర్శనం.. ఇదేం లుక్ అంటున్న నెటిజన్లు
