మహేష్ బాబు మూవీ నాన్-స్టాప్ షూటింగ్ షెడ్యూల్.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా పెట్టి దర్శకుడు త్రివిక్రమ్ SSMB28 అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ యాక్షన్ రోల్‌లో నటిస్తున్నాడు. అలానే ఈ మూవీని ఫ్యామిలీ యాక్షన్‌తో కూడిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక SSMB28 సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, హైపర్ ఆది కీలక పాత్రలలో నటిస్తుండగా, జగపతి బాబు విలన్ గా కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అయితే అసలు విషయం ఏంటంటే, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకున్న SSMB 28 సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ని మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా రిలీజ్ చెయ్యనున్నారు. ఇక మూవీ కి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ని జూన్ 7 నుంచి నాన్‌-స్టాప్‌గా కొన్నాళ్లపాటు కొనసాగించేలా ప్లాన్ చేశారట. దానితో మేజర్ షూట్ మొత్తం కంప్లీట్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతా కరెక్ట్ టైమ్ కి పూర్తి అయితే, మొదట ప్రకటించిన విధంగా 2024 సంక్రాంతి పండుగ సందర్బంగా ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమాని ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తాం అని మేకర్స్ చెప్తున్నారు.

Share post:

Latest