ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన పోస్ట్ పై రిప్లై ఇచ్చిన రష్మిక..!!

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగు అమ్మాయి అయినా తెలుగు సినిమాలు మాత్రం చాలా తక్కువగానే చేస్తోంది. ఈ మధ్యనే ఈమె నటించిన ఫర్హానా సినిమా తెలుగు తమిళ్ చిత్రాలలో విడుదలయ్యింది. తెలుగు సినిమా ప్రచారాలకు వచ్చినప్పుడు ఈమె చెప్పే సమాధానం వివాదానికి దారి తీస్తోంది ఈమె సమాధానం రష్మిక నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర గురించి మాట్లాడుతూ శ్రీవల్లి పాత్ర నేను చేస్తే ఇంకా బాగా చేసేదాన్ని అన్నట్టుగా ఐశ్వర్య అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

Rashmika Mandanna reacts to Aishwarya Rajesh's comment on her - Hindustan  Times
దీని మీద ఐశ్వర్య రాజేష్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుగులో ఎటువంటి పాత్రలు అంటే ఇష్టం అని అడగగా నేను దానికి టాలీవుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పాను.. అలాగే పుష్ప సినిమాలు శ్రీవల్లి వంటి పాత్ర చేయాలని ఉందని తెలిపింది అటువంటి పాత్రలు తనకు బాగా సూట్ అవుతాయని తెలిపింది. అంతే కానీ అది నేను చేస్తే ఇంకా బాగా చేస్తాను అని అనలేదని.. రష్మిక చాలా బాగా చేసింది.ఆ పాత్రలో నా సమాధానాన్ని తప్పుగా అర్థం చేసుకొని రష్మిక నటన నేను కించపరిచినట్టుగా రాశారు.. తన తోటి నటులను గౌరవంతో చూస్తాను ఎందుకు కించపరుస్తాను ఇలాంటి వ్యాఖ్యలు రాయడం మానుకోవాలని తెలిపింది.

అయితే ఈమె వివరణ చూసిన రష్మిక స్పందిస్తూ మీరు వివరణ ఇవ్వాల్సిన పనిలేదు.. ఎందుకంటే మీరు ఏం చెప్పారు నేను పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నాను అందుకని మీరు ఇలా వివరణ ఇవ్వాల్సిన పనిలేదు.. నాకు మీ మీద ప్రేమ గౌరవం ఎప్పుడూ ఉంటాయి.. మీ ఫర్హానా సినిమా ఆల్ ది బెస్ట్ అని రష్మిక రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest