బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ నుంచి త‌ప్పించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ల‌క్కంటే ఇదేనేమో!

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌రకొండ.. తాజాగా ఓ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ నుంచి ల‌క్కీగా త‌ప్పించుకున్నాడు. ఇంత‌కీ ఆ డిజాస్ట‌ర్ మ‌రేదో కాదు నిన్న మంచి అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన `అన్నీ మంచి శకునములే` మూవీ. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంతోష్ శోభ‌న్‌, మాళ‌విక నాయ‌ర్ జంట‌గా న‌టించారు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని స్వప్నా సినిమా, మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌లపై స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌ నిర్మించారు. ఇందులో నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేశ్, గౌతమి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 18న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది.

తొలి ఆట నుంచే ఈ చిత్రం నెగ‌టివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. అయితే నిజానికి ఈ సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ చేయాల్సింద‌ట‌. నందినీ రెడ్డి ఈ క‌థ‌ను మొద‌ట విజ‌య్ దేవర‌కొండ కోసం రాసుకుంద‌ట‌. కథ కూడా నేరెట్ చేయ‌గా.. విజయ్ సినిమా చేసేందుకు ఓకే చెప్పారంట. అయితే ఇది ’అర్జున్ రెడ్డికి‘ ముందే ప్రారంభం కావాల్సిన చిత్రం. కానీ, అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ రేంజ్ మారిపోయింది. దాంతో నందిని రెడ్డి విజయ్ స్థాయికి ఈ సినిమా వర్కౌట్ కాదనుకుందంట. ఆ త‌ర్వాత క‌థ‌లోకి సంతోష్ వ‌చ్చాడు. అయితే సోలోగా వ‌చ్చినా ఈ సినిమాకు శ‌కునం మాత్రం క‌లిసిరాలేదు.

Share post:

Latest