సితార డ్యాన్స్‌పై నమ్రత అదిరిపోయే పోస్ట్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు. అతడు, పోకిరి, మురారి, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ కి మహేష్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ హీరో నమ్రతా శిరోద్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సోషల్ మీడియాలో సితార బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ చేస్తూ, డైలాగులు చెబుతూ మహేష్ అభిమానుల హృదయాలను దోచేస్తుంది.

ఈ చిన్నారికి సోషల్ మీడియాలో 11 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు యూట్యూబ్‌లోనూ సీతారాల లక్షలాది సబ్‌స్క్రైబర్లతో ఒక ఛానల్ నడుపుతోంది. సితారకి ఇంతమంది ఫాలోవర్లు ఉండటానికి కారణం కేవలం ఆమె తల్లిదండ్రులు మాత్రమే కాదు ఆమె టాలెంట్ కూడా కారణమని చెప్పొచ్చు. సితార కొద్ది వారాల క్రితం భరతనాట్యం కూడా నేర్చుకుంటానని చెప్పింది. చెప్పడమే కాదు ఈ క్లాసికల్ డ్యాన్స్ ని నేర్చుకుంది. సోషల్ మీడియాలో తాను భరతనాట్యం చేస్తున్న ఒక వీడియో పోస్ట్ షేర్ చేసింది.

ఈ వీడియోని తల్లి నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీన్ని చూసిన అభిమానులు గ్రేట్ పర్ఫామెన్స్ అంటూ సితారకి కితాబిస్తున్నారు. “మనసుతో డ్యాన్స్ చేయండి. మీ పాదాలు మిమ్మల్ని ఫాలో అవుతాయి” అనే క్యాప్షన్‌తో నమ్రత ఈ వీడియోను పోస్ట్ చేసింది. అలానే సితార పంచుకున్న పోస్ట్‌ కింద కళ్ళతో లవ్ కురిపించే ఎమోజీలు కామెంట్ చేసింది. కాగా మల్టీ టాలెంటెడ్ అయిన సితార సినిమాలో హీరోయిన్ గా అడుగుపెడితే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest