కస్టడీ.. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్వకత్వం వహిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.
టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక రెండో రోజుకు నెగటివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వడంతో.. కస్టడీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.82 కోట్ల షేర్ ని సాధిస్తే.. 2వ రోజు రూ. 80 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.1.06 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 21.32 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంత భారీ టార్గెట్ ను చైతూ రీచ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఏరియాల వారీగా కస్టడీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నిజాం: 1.03 కోట్లు
సీడెడ్: 33 లక్షలు
ఉత్తరాంధ్ర: 31 లక్షలు
తూర్పు: 19 లక్షలు
పశ్చిమ: 14 లక్షలు
గుంటూరు: 28 లక్షలు
కృష్ణ: 20 లక్షలు
నెల్లూరు: 14 లక్షలు
—————————————
ఏపీ+తెలంగాణ= 2.62 కోట్లు(4.80 కోట్లు~ గ్రాస్)
—————————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 11 లక్షలు
ఓవర్సీస్: 80 లక్షలు
తమిళం – 15 లక్షలు
——————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 3.68 కోట్లు(7.15 కోట్లు~ గ్రాస్)
——————————————-