‘రామబాణం’ క్లోసింగ్ కలెక్షన్స్.. పాపం ప్ర‌మోష‌న్ ఖ‌ర్చులు కూడా రాలేదుగా!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హ‌యాతి జంటగా నటించిన తాజా చిత్రం `రామబాణం`. శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ, నాజ‌ర్, తరుణ్ అరోరా, సచిన్ ఖేడేకర్ త‌దిత‌రులు కీలక పాత్రల‌ను పోషించారు. శ్రీ‌వాస్‌, గోపీచంద్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ మే 5న విడుద‌లైన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. రొటీన్ క‌థ‌ను అంతే రొటీన్ గా తీశారంటూ గోపీచంద్ అభిమానులు కూడా పెద‌వి విరిచారు. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది.

 

రూ. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 4 కోట్లు షేర్‌ను మాత్ర‌మే వ‌సూల్ చేయ‌గ‌లిగింది. ఈ క‌లెక్ష‌న్స్ చూసి పాపం ప్ర‌మోష‌న్ ఖర్చులు కూడా రాలేదంటూ సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రామబాణం దెబ్బ‌కు దాదాపు రూ. 11 కోట్ల రేంజ్ లో న‌ష్టం వాటిల్లింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఈ మూవీ వ‌ల్ల గోపీచంద్ ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా భారీగా డ్యామేజ్ అయింది.

Share post:

Latest