చైతూకు మైండ్ గాని దొబ్బిందా.. ఓవైపు వాళ్లు ఏడుస్తుంటే ఈ సెల‌బ్రేష‌న్స్ ఏంటో?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజాగా `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలను పోషించారు. యాక్షన్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రం మే 12న అట్టహాసంగా విడుదలైంది.

కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. టాక్‌ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం హ‌వా చూపించలేకపోతోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కనీసం మూడు కోట్లు కూడా రాబట్టలేక నానా అవస్థలు పడింది. ఇలాంటి తరుణంలో నాగచైతన్య అండ్ మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం.

నిన్న హైదరాబాద్ లో కస్టడీ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సంబరాలు చేసుకోవడంలో అర్థం ఉంది. కానీ తొలి ఆట నుంచి కస్టడీ ఫ్లాప్ టాక్ ను మూటగ‌ట్టుకుంది. అసలే బ‌య్య‌ర్లు క‌స్ట‌డీ ఫ్లాప్ అని ఏడుస్తుంటే.. నాగచైతన్య అండ్ టీమ్ సినిమా హిట్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజ‌న్లు నాగచైతన్యపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వరుస ప్లాపులు కారణంగా చైతూకు మైండ్ దొబ్బిందా.. అందుకే ఇలాంటి పని చేశాడా అంటూ చుర‌క‌లు వేస్తున్నారు.

Share post:

Latest