ఫస్ట్ టైమ్ ప్రేమ..డేటింగ్.. పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఉప్పెన సినిమాతో పరిచయమైంది కృతిశెట్టి.ఒక్క నైట్ తోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన అమ్మడు ఆ తరువాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అయితే కృతిశెట్టి కథల ఎంపిక విషయంలో కాస్త ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఉప్పెన సినిమా ఎంత సక్సెస్ అయిందో.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అడపాదడపాక ఆడి కలెక్షన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు కృతి శెట్టి స్టోరీ సెలక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తోందట.

rspnetwork.in: Krithi Shetty
ఈ మధ్యనే నాగచైతన్యతో కస్టడీ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ కొడుతుందని అనుకుంటే అది యావరేజ్ గా నిలిచింది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో లవ్ డేటింగ్ లాంటి విషయాలు మీద ఇంట్రెస్ట్ కామెంట్స్ చేసింది. ఈ ముద్దుగుమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది కానీ నేను ఇప్పటివరకు అమ్మానాన్న ప్రేమని తప్ప మరే ప్రేమను చూడలేదని చెబుతోంది. అంతేకాకుండా తనకు కాలేజ్ డేస్ లో బోలెడన్ని లవ్ లెటర్స్ వచ్చాయని కానీ తనకు మాత్రం ఎలాంటి ఫీలింగ్ కలగలేదని చెప్పుకొచ్చింది.

అయితే కృతి శెట్టి ని ఒక ప్రశ్న యాంకర్ అడగగా.. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడగ్గా నేను మా అమ్మానాన్నలను తప్ప ఎవరిని ప్రేమించలేదని తేల్చి చెప్పేసింది. అంతేకాదు సినిమాలతో ప్రేమ, షూటింగ్ తో డేటింగ్ అంటూ నవ్వుతూ తెలియజేసింది. ప్రస్తుతానికి తన కెరీరే తనకి ఇంపార్టెంట్ అని మిగతా విషయాలన్నీ తనకి అనవసరమంటూ తెలియజేసింది.కృతి శెట్టి వరుస సినిమాల్లో నటిస్తోంది. కానీ అవి కమర్షియల్ హిట్లు మాత్రం కొట్టలేదు. అందుకనే ఇప్పుడు వచ్చిన ప్రతి ఛాన్స్ చేయకుండా తన పాత్రకు తగ్గ కథ దొరికితేనే చేస్తానని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest