రంభ చేసిన పని వల్ల నరకం అనుభవించిన తండ్రి.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు రోజా, మీనా ,రంభ వీరంతా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లే…అయితే చాలామంది అంటుంటారు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే హీరోయిన్స్ హవా పెద్దగా ఉండదని.. కానీ తెలుగు హీరోయిన్స్ లో కూడా తన వాళ్లకే నరకం చూపించిన హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె రంభ.. ఈమె విజయవాడ ప్రాంతానికి చెందిన హీరోయిన్.. మొదటి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ .. అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Actress Rambha Mother Birthday Celebration | Latest Family Photos with  Husband, Daughters,son - YouTube

ఇక ఈమె తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో అయితే ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకొని ఆ తర్వాత బోలెడన్ని అవకాశాలను చుట్టుముట్టేలా చేసుకుంది. అప్పట్లో ఈమె రేంజ్ ఎలా ఉండేది. అంటే ఇప్పుడు శ్రీ లీల రేంజ్ ఎలా ఉందో అంతకుమించినట్టుగా ఉండేది.

Actress Rambha Baby Shower Function Photos | Chennai365

అయితే గత కొంతకాలం క్రితం ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వల్ల బాధపడిన వాళ్ల గురించి యాంకర్ అడిగినప్పుడు రంభ ఇచ్చిన సమాధానం చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..ఆమె మాట్లాడుతూ నేను ఇంట్లో ఎవరితోనైనా గొడవ పడితే కనీసం ఒక నెల మాట్లాడను ఒకవేళ నా తప్పు ఏమైనా ఉంటే కచ్చితంగా సారీ చెప్తాను. అలా కాదని నా తప్పు లేకపోయినా నన్ను నిందిస్తే నేను ఊరుకోలేను.

అలా ఒక విషయంలో మా నాన్నకు ఇలాగే జరిగింది. అప్పట్లో మా నాన్నతో ఆరు నెలలు మాట్లాడలేదు. అలా నేను మాట్లాడకపోవడం వల్ల మా నాన్న నరకం అనుభవించాడు. ఎందుకంటే ఆయనకి నేనంటే చాలా ఇష్టం మనకు ఇష్టమైన వాళ్లు మనతో మాట్లాడకపోతే ఎంత నరకం ఉంటుందో మనకు బాగా తెలుసు. ఆ నరకాన్ని మా నాన్న చాలా అనుభవించాడు అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Latest