సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ రోహిణి.. ఎందుకంటే..?

బుల్లితెర జబర్దస్త్ ఆర్టిస్టుగా పేరుపొందింది రోహిణి ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సీరియల్స్ ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించిన రోహిణి జబర్దస్త్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమధ్య పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటుంది రోహిణి తాజాగా ఒక నిర్లక్ష్యం చేయడం వల్ల ఈమె ప్రమాదానికి గురయ్యారని తెలియజేస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రోహిణి మొదట్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ లో తన పాత్ర బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో అవకాశాలు వస్తూ ఉన్న మాటీవీలో శ్రీనివాస కళ్యాణం ,ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ ద్వారా పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ షో వల్ల బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ని ఏర్పాటు చేసుకుంది.

అలా పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. తనకంటూ ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో సందడి చేస్తూ ఉంటుంది రోహిణి .తాజాగా ఒక వీడియోని షేర్ చేసి అందులో తనకు ఒక సర్జరీ చేశారని అనవసరంగా సర్జరీకి వెళ్లాను అంటూ చెప్పుకొస్తూ బాధపడుతోంది. 5 సంవత్సరాల క్రితం తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందని దీంతో తన కాళ్లకు రాడ్డు వేశారని అయితే ఇంతకాలం ఆ రాడ్డు తీయడానికి సమయం లేదని షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల తనకు ఈ ఆపరేషన్ చేయలేదని దీంతో ఇప్పుడు సమయం దొరికిందని హాస్పిటల్ కి వెళ్తే తన రాడు తీయడానికి కుదరలేదని దానివల్ల సర్జరీ చేయడంతో ఇప్పుడు రెండు కాళ్లు బాగా నొప్పి వస్తున్నాయని తెలియజేస్తోంది. అప్పట్లోనే తాను కాళ్లకు వేసిన రాడ్ తీయించుకుంటే ఎంత ప్రాబ్లం ఉండేది కాదేమో అన్నట్లుగా తెలుపుతోంది.<
/p>

Share post:

Latest