మ‌ద‌ర్స్ డే స్పెష‌ల్‌.. బేబీ బంప్ ను చూపిస్తూ ఉపాస‌న షాకింగ్ పోస్ట్‌!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న ప్రెగ్నెంట్ అయింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల ఫ‌స్ట్ చైల్ట్ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక‌పోతే నేడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఉపాస‌న ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.

బ్లాక్ టీ ష‌ర్ట్ అండ్ ప్యాంట్ ధ‌రించి బేబీ బంప్ ను చూపిస్తూ దిగిన ఫోటోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్న ఉపాస‌న‌.. `సరైన సమయంలో తల్లిగా మారిన నేను గర్వంగా ఫీలవుతున్నాను. తల్లి కావాలనే నా నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే ఆశ‌తో తీసుకున్నది కానేకాదు. స‌మాజం కోసం అంత‌కంటే కాదు.

అపరిమితమైన ప్రేమను నా బిడ్డకు ఇచ్చేందుకు నేను ఎమోషనల్ గా ప్రిపేర్ అయ్యాకే గర్భం దాల్చాలని కోరుకున్నాను. ఇప్పుడు నాకు పుట్టిబోయే బిడ్డ ప్రేమ, సంరక్షణకు, పోషణకు అర్హురాలు` అంటూ ఉపాస‌న పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది. కాగా, ఇటీవల హైదరాబాద్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఉపాసన సీమంత వేడుకలు ఘనంగా జ‌రిగాయి. స్వదేశంలోనే ఉపాస‌న త‌న తొలి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. అపోలో హాస్పిటల్స్ తనకు డెలివరీ జరుగుతుందని ఆమె స్పష్టత ఇచ్చింది.

https://www.instagram.com/p/CsNeEQvhll0/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Share post:

Latest