విజయేంద్ర ప్రసాద్ లేకపోతే రాజమౌళి పైసాకి కూడా పనికిరాడా..??

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి. ఈ దర్శక దిగ్గజం ఆర్ఆర్‌ఆర్‌తో ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. ఈ డైరెక్టర్ వల్ల ఇండియన్ సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసిందంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి సినిమాల ముందు హాలీవుడ్ చిత్రాలు కూడా దిగదుడిపేనని ఎన్నో సందర్భాల్లో నిరూపితం కూడా అయింది. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్‌తో పాటు మంచి కథతో ప్రేక్షకులను వెండితెర కట్టుపడేసే రాజమౌళి చాలా టాలెంటెడ్ అని అందరూ అంటుంటారు. అయితే తండ్రి విజయేంద్ర ప్రసాద్ లేకపోతే రాజమౌళి సినిమాలు పైసలు కూడా వసూలు చేయలేవని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది.

రాఘవేంద్రరావు వద్ద రాజమౌళి డైరెక్షన్స్ స్కిల్స్ నేర్చుకున్నాడు. అయితే అతని సినిమాలలోని కథలు మాత్రం ఆయన రాయలేదు. అవన్నీ కూడా తన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ రాశారు. రాజమౌళి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌ అయిన విక్రమార్కుడు, ఛత్రపతి, బాహుబలి వంటి సినిమాలకు విజయేంద్రప్రసాద్ కథలు అందించారు. అందుకే విజయేంద్రప్రసాద్ లేకపోతే రాజమౌళి జీరో అని కొందరు అంటున్నారు. అయితే ఈ వాదనలను మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజమౌళి సొంతంగా స్క్రీన్ ప్లే రాసుకుంటాడని, తన తండ్రి రాసిన కథలను తెరపై అద్భుతంగా చూపించడం ఒక్క రాజమౌళికే సాధ్యమవుతుందని, అందుకే ప్రేక్షకులు అతని సినిమాకు అంతగా కనెక్ట్ అవుతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళిలో టాలెంట్ లేదని అనడం మూర్ఖత్వం అని ఇంకొందరు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి గతంలో విజయేంద్రప్రసాద్ రాసిన కథలతో వేరే వారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు దీన్నిబట్టి రాజమౌళికి ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Share post:

Latest