ఇక పై బాలయ్య సినిమాలు చూసేదేలే..? తేల్చి చెప్పేసిన స్టార్ హీరో ఫ్యాన్స్..!!

సోషల్ మీడియాలో ఫాన్స్ మరి టూ మచ్ హంగామాలు చేస్తున్నారా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా స్టార్స్ ఫాన్స్ ఏ రేంజ్ లో కొట్టుకు చస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మా హీరో తోపు అంటే మా హీరో కత్తి అంటూ మా హీరోనే నెంబర్ వన్ అంటూ నాన్న రచ్చ చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నందమూరి హీరోలు బాలకృష్ణ వ్స్ ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్ లో యుద్ధానికి దిగారో మనకు బాగా తెలిసిందే .

రెండు వర్గాలుగా చీలిపోయి మాటలతో తూటాలు పేలుస్తున్నారు . ఒకరిపై మరొకరు దిగజారుడు కామెంట్స్ చేసుకుంటున్నారు . మొన్నటి వరకు బాగా కామన్ గానే ఉన్న బాలయ్య -ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా విడిపోవడానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కారణమంటూ తెలుస్తుంది. మే 20న హైదరాబాద్ వేదికగా సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి . ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు అందరు వచ్చారు. అయితే ఎన్టీఆర్ మాత్రం రాలేకపోయాడు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఎందుకు రాలేకపోతున్నాను కూడా అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు.

అయితే బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ కావాలని ఈవెంట్ కి రాలేదని రకరకాల వార్తలు పుట్టించారు . ఎన్టీఆర్ని దెబ్బతీయాలని ఎదురుచూస్తున్న వాళ్లకు ఆయుధంలా దొరికింది . ఈ సిచువేషన్ ని క్యాచ్ చేసుకున్నారు అలాంటి మనుషులు . అయితే ఎన్టీఆర్ కి అలాంటి మనస్తత్వం కాదని ..ఎన్టీఆర్ అందర్నీ ఒకేలా చూస్తారని.. ఇంకా బాలకృష్ణని ఎన్టీఆర్ దూరం పెట్టారని ఆ విషయం అందరికీ తెలుసని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వ్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ మామూలుగా జరగడం లేదు . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చి లేచి ఇకపై ఎన్టీఆర్ సినిమాలు తప్పిస్తే నందమూరి ఫ్యామిలీలో ఏ హీరో సినిమాను చూడబోమని హిట్ చేయబోమని ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వ్శ్ బాలకృష్ణ ఫ్యాన్స్ వార్ టు హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!