మెగాస్టార్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ ఇదే..!

సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో మిస్సయిన హిట్స్ మరో స్టార్ ఖాతాలో పడుతుంటాయి. అనుకోని కారణాలతో ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. లేదా రిజెక్ట్ చేయడంతో ఆ స్టోరీని మరో హీరో ఓకే చేసేస్తాడు. అలా తమ కెరీర్‌‏లో అద్భుతమైన భారీ విజయాలను అందుకున్న మిస్ అయిన స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక‌రు. అయితే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన చిరంజీవి కొన్ని కారణాల వల్ల కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రం వదులుకున్నాడట. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మన్నెంలో మొనగాడు : కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ముందుగా ఈ సినిమాను చిరంజీవితో చేయాలనుకున్నప్పటికీ ఆయన డేట్ లు అడ్జస్ట్ కాకపోవటంతో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆఖరిపోరాటం : ఈ సినిమాను మొదట అశ్వినీ దత్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో నాగార్జున హీరోగా ఈ సినిమా వచ్చింది

అసెంబ్లీ రౌడీ : బి గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ సినిమాని కూడా ముందుగా చిరంజీవితో చేయాల్సి ఉంది కానీ ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం ఉందని మరోవైపు తాను బిజీగా ఉన్నానని చిరు వదులుకోవడంతో మోహన్ బాబు చేసి సూపర్ హిట్ కొట్టాడు.

నెంబర్ వన్ : ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన నెంబర్ వన్ సినిమాలో కూడా ముందుగా చిరంజీవి నటించాల్సి ఉంది కానీ ఆయ‌న‌ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

సాహస వీరుడు సాగర కన్య : ఇలాంటి కథతోనే వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా ప్రేక్షకులు ఆదరణకు నోచుకోకపోవడంతో ఇక ఈ సినిమా చేయడానికి రిస్క్ చేయలేదు చిరంజీవి. కానీ వెంకటేష్ ఇదే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

చంద్రముఖి :: బిఎస్ ఆదిత్య సినిమాను చిరంజీవితో చేయాలని అనుకున్నారు. ఇక ఆయన డేట్స్ కోసం ఎన్నో రోజులు ఎదురు చేశారు. కానీ చివరికి ఈ సినిమా రజనీకాంత్ తో చేయగా సూపర్ హిట్ అయింది.

టైగర్ నాగేశ్వరరావు : రవితేజ హీరోగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న టైగర్ నాగేశ్వరరావును కూడా ముందుగా చిరంజీవితో తీయాలని అనుకున్నారు. కానీ చిరంజీవికి కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు.