మనసులోని కోరికను బయటపెట్టిన సుకుమర్ భార్య.. మరి అందుకు రెడీ నా లెక్కల మాస్టారు..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సుకుమార్ హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప తో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ దక్కించుకొని స్పెషల్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సుకుమార్ ..త్వరలోనే పుష్ప2 తో గ్లోబల్ వైడ్ గా తన పేరు మారుమ్రోగిపోయే విధంగా చేసుకుంటాడు అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఆయన భార్య తబితా సుకుమార్ కూడా అదే కాన్ ఫిడెన్స్ ని ఎక్స్ ప్రెస్ చేసింది .

రీసెంట్గా మీడియాతో ముచ్చటించిన సుకుమార్ భార్య తబితా..సుకుమార్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే తబితా సుకుమార్ తన మనసులోని కోరికను బయటపెట్టేసింది . ఈ మధ్యకాలంలో రీ రిలిజ్ ట్రెండ్ ఎక్కువుగా కనిపిస్తుంది. దాదాపు ప్రతి స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ అవుతూ మరోసారి అభిమానులకు కొత్త రకమైన ఫీలింగ్ ఇస్తున్నారు .

ఈ క్రమంలోనే తబిత సుకుమార్ తన భర్త డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలలో ఏ సినిమా మళ్లీ రిలీజ్ చేస్తే చూడాలి అనుకుంటున్నారు అని అడగ్గా.. ఆమె ఏకంగా రెండు సినిమాల పేర్లు చెప్పుకొచ్చింది .తబితా సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ ..”జగడం , వన్ నేనొక్కడినే చిత్రాలు రీ రిలీజ్ చేయమని నేను సుకుమార్ కి చెప్పాను.. ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం.. ఎప్పుడు చూసిన కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది . కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఎందుకో అవి జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు . నా మనసుకు మాత్రం బాగా దగ్గరయ్యాయి. ఆ సినిమాలో మ్యాజిక్ ఉంది. రీ రిలీజ్ చేస్తే చూడాలి అన్నది నా కోరిక ..చూద్దాం మరి నా కోరిక ఎప్పుడు తీరుతుందో ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చేసింది. ప్రెసెంట్ తబిత సుకుమార్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2009లో సుకుమార్ – తబితాను ప్రేమ వివాహం చేసుకున్నారు . వీరికి ఓ కుమార్తె ఒక కొడుకు ఉన్నాడు . కుమార్తె పేరు సుకృతి ..కుమారుడు పేరు సుకృత్..!!