ప్రదీప్ ని హగ్ చేసుకుని మరి ..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన శేఖర్ మాస్టర్ .. ఏమైందంటే..?

ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే . అమ్మ అని ఎవరినైనా పిలవగలం ..కానీ నాన్న అని మన నాన్ననే పిలవగలం . నాన్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు . అది అందరికీ తెలిసిన విషయమే . అలాంటి నాన్న మనకు లేకపోతే.. మన కళ్ల ఎదుట కనిపించకపోతే ..ఆ బాధ వర్ణాతీతం. అలాంటి బాధ తండ్రి లేని వాళ్ళకే తెలుస్తుంది . కాగా అలాంటి బాధాకరమైన బాధను అనుభవిస్తున్నాడు శేఖర్ మాస్టర్ – యాంకర్ ప్రదీప్ .

ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఢీ 15 షో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే . కాగా ఈ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ . అలాగే హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా మరో జడ్జిగా వ్యవహరిస్తుంది . ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే ఎప్పుడూ డ్యాన్స్ ల తో స్టేజ్ దద్దరిల్లిపోయే ఢీ షో ..ఈసారి కన్నీటితో తడిసిపోయింది . మరీ ముఖ్యంగా ఈ ప్రోమోలో కంటెస్టెంట్ నవీన్ తన డాన్స్ లో ఓ స్కిట్ కూడా జత చేశాడు . అందులో తండ్రి సెంటిమెంట్ ని కళ్లకు కట్టిన్నట్లు చూపించాడు. ఈ క్రమంలోనే ఢీ షోలో ఉన్న ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు . అంతేకాదు ప్రోమో చూసిన ప్రతి మనిషి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు .

ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ – యాంకర్ ప్రదీప్ మరింతగా డీప్ గా కనెక్ట్ అయిపోయి తమ తండ్రులను తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చేశారు. తండ్రి ఉన్నప్పుడే బాగా చూసుకోండి అంటూ యాంకర్ ప్రదీప్ ని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు శేఖర్ మాస్టర్ . అంతేకాదు శ్రద్ధ కూడా ఏడ్చేసింది . యాంకర్ ప్రదీప్ తన ఏడుపును ఆపుకోలేకపోవడం మనం ఈ ప్రోమోలో చూడవచ్చు. అంతేకాదు ప్రదీప్ ఈ మధ్యనే తన తండ్రిని పోగొట్టుకున్నాడు..ఈ ప్రోమో కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు జనాలు..!!