మరొకసారి లవర్ తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా..!!

టాలీవుడ్ లో హీరోయిన్ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ విషయాలపై తమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తనతో కలిసి పని చేసినంత మాత్రాన ప్రేమలో పడిపోతానని కాస్త ఘాటుగానే స్పందించింది. కానీ వీటిపై విజయ వర్మ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అయినా సరే బాలీవుడ్ మీడియాలో ఈ ఎఫైర్ వార్తలు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తమన్నా, విజయవర్మ గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా విజయ్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. అందులో క్యాప్షన్ ఇస్తూ.. యే దేఖ్ కే క్యా సీఖా తుమ్ననే అంటూ రాసుకు వచ్చారు. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్లో నెమలి బొమ్మ నీరు తాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ పక్కనే పూల బెంచ్ పైన సేద తీరుతున్న ఒక అమ్మాయి కనిపిస్తోంది. అయితే విజయ్ వర్మ తల కాస్త అడ్డుగా ఉండడంతో ఆమె ఎవరో స్పష్టంగా కనిపించలేదు. దీంతో కొంతమంది ఆమె తమన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు

అలా కాకపోతే విజయవర్మ ఎందుకు అడ్డంగా ఉన్నాడు నెమలి బొమ్మని పిక్చర్లు క్యాప్చర్ చేయడం వెనుక కారణం ఏమై ఉంటుంది అంటూ సందేహాన్ని తెలియజేస్తున్నారు. అయితే మరి కొంతమంది అక్కడే ఉన్న ఎవరైనా అమ్మాయి అయినా అవ్వచ్చు అంటూ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. క్లారిటీ లేని పిక్చర్తో తమన్నాని ఎలా కన్ఫామ్ చేస్తామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి విజయవర్మ వెనుక ఉన్నది తమన్న ఇంకెవరైనా అనే విషయం తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Vijay Varma (@itsvijayvarma)