నాని దసరా సినిమా హిట్ అవ్వడానికి అసలు కారణం ఆమె .. బయటపడ్డ సెన్సేషనల్ మ్యాటర్..!?

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని రీసెంట్ గా నటించిన సినిమా దసరా. డెబ్ల్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది. శ్రీరామనవమి సంధర్భంగా మార్చి 30న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకుంది.

అంతే కాదు నాని కెరియర్ లోనే ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ డే నే 15 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డ్ నెలకొల్పింది. అంతేనా ఏకంగా ఈ సినిమా రెండు రోజులు కంప్లీట్ చేసుకునే టైంకి 53 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరియర్ లోనే కనీ విని ఎరుగని రికార్డును క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద ఇంతకు ముందు ఉన్న రికార్డులను చెరిపేసాడు నాని.

నాచురల్ స్టార్ నాని దసరా సినిమా ఇంతటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం ఆయన భార్య అంజన అంటూ టాక్ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నాని దసరా సినిమా హిట్ అవ్వడానికి .. నాని కంటే ఎక్కువగా అంజనానే కష్టపడిందని .. షూటింగ్ కి వెళ్లే ప్రతి రోజు ఆయనను టైం టు టైం కేరింగ్ గా చూసుకొని .. అన్ని గుర్తుచేస్తూ ఆయనని షూటింగ్ సెట్స్ కి పంపించేదట .

అంతేకాదు ఈ సినిమా హిట్ అవ్వాలని ఏకంగా అంజన భారీ మొక్కులు కూడా మొక్కేసిందట . ఈ క్రమంలోనే సినిమా హిట్ కి 50% కారణం నాని అయితే 50% కారణం ఆయన భార్య అంజన అంటూ నాని అభిమానులు చెప్పుకొస్తున్నారు . దీంతో మరోసారి సోషల్ మీడియాలో నాని దసరాకి సంబంధించిన పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి..!!