ఒక్క పాట కోసం రూ.5 కోట్లు.. పూనకాలు తెప్పించనున్న శ్రీలీల మూవీ??

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD సినిమా ద్వారా మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలలో నటిస్తుంది. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల కీలక పాత్ర చేస్తుంది.

ఈ బాలయ్య సినిమా కోసం ముంబైకి చెందిన వందలాది మంది స్థానిక జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్‌లను రప్పించారు. వారితో కొత్త మాస్ సాంగ్ షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ఈ సినిమా లో ఒక పండుగ సందర్భంగా ఒక పాటను షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. దానికోసం నాలుగైదు రోజుల సమయం పట్టనుంది.

5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాటకి తమన్ సంగీతం అందిస్తున్నారు. కెమెరాలు, లైటింగ్, క్రేన్లు, ముంబై డ్యాన్సర్లు, విమాన టిక్కెట్లు, వసతి, ఫిల్మ్ సిటీ ఫీజులు అన్ని కలిపి 5 కోట్ల వరకూ ఖర్చు అవుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక శ్రీలీల పాత్ర గురించి ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేది. సాహు గారిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా పండుగకి విడుదల కానుంది.

ఈ సినిమాతో శ్రీలీల క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇక అనిల్ రావిపూడి  తీసే సినిమాలు ఎప్పుడూ వినోదాన్ని పంచుతూనే ఉంటాయి. బాలకృష్ణ, అనిల్ రావు కాంబో కచ్చితంగా హిట్ తెచ్చిపెడుతుందని సినీ అభిమానులు  నమ్ముతున్నారు.