మంచు బ్రదర్స్ గొడవలో మరో ట్విస్ట్.. రియాల్టీ షో కాదన్న మంచు లక్ష్మీ..!

గత వారం నుంచి మంచు కుటుంబంలో ఎన్నో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు కథనాలుగా వెలువడుతున్నాయి. ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మనోజ్ అనుచరుడు సారధి ఇంట్లోకి చొరబడిన విష్ణు.. అతనిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. తర్వాత మోహన్ బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం.. చిన్న గొడవ అని విష్ణు చెప్పడం అన్నీ తెలిసాయి.. కానీ ఎవరు కూడా నమ్మలేదు.

Is Manchu Lakshmi And Manoj Reject House Of Manchus Reality Show? Deets  Inside - Sakshi

అయితే ఈ గొడవ అంతా నిజం కాదు ఫ్రాంక్ అని చెబుతూ మార్చి 30వ తేదీన విష్ణు ఒక వీడియో షేర్ చేశాడు. అందులో హౌస్ ఆఫ్ మంచూస్ పేరిట తమ సొంత బ్యానర్ లోనే ఒక రియాల్టీ షో రాబోతోందని తెలిపాడు. కానీ మంచు లక్ష్మి , మనోజ్ మాత్రం ఈ రియాల్టీ షో ట్రైలర్ షేర్ చేయలేదు. దీంతో అభిమానులలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఇదంతా ఫ్రాంక్ అంటే నమ్మబుద్ధి కూడా కావడం లేదు. రియాల్టీ షోలో భాగంగానే మంచు బ్రదర్స్ ఇలా గొడవపడ్డారా.. ఇదేదో తేడాగా ఉందే అని కూడా కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై మంచు మనోజ్ , మంచు లక్ష్మి స్పందించినట్లు తెలుస్తోంది.. హౌస్ ఆఫ్ మంచు రియాల్టీ షో గురించి ప్రస్తావించగా తాము ఎటువంటి రియాల్టీ షో చేయలేదని కుండబద్దలు కొట్టింది. అటు మనోజ్ టీం కూడా ఈ వార్తలను తోసిపుచ్చినట్లు కనిపిస్తోంది. ” ఆరోజు సారథి ఇంట్లో గొడవ జరుగుతుంటే.. సారధి భార్య ఫోన్ చేస్తే మనోజ్ అక్కడికి వెళ్ళాడు.. అంతేకానీ షూటింగ్ కోసం వెళ్లలేదు. తాను ఎటువంటి రియాల్టీ షో చేయడం లేదు.. ప్రస్తుతం అతడు పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నాడు” అంటూ మనోజ్ టీం వెల్లడించింది. ఏది ఏమైనా మంచు విష్ణు మాటలు నమ్మేలా లేవు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.