రాజకీయాల్లోకి రానున్న విజయ్ సేతుపతి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా , నటుడిగా, విలన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు ఏకైక ఛాయిస్ గా మిగిలారు.. ఇకపోతే తాజాగా తమిళనాడు రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ పుట్టినరోజు పురస్కరించుకొని చెన్నైలోని తేనాంపేటలో స్టాలిన్ 70 పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ నటీనటులతో పాటు విజయ సేతుపతి కూడా విచ్చేశారు.

Vijay Sethupathi fans file complaint against abusive comments on viral  video | The News Minute

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి యువత రాజకీయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.. తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది.. అయితే ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ఇప్పుడు లేదు.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో త్వరలోనే విజయ్ సేతుపతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన రాజకీయాల్లో కూడా తన స్టార్ డం ను నిలబెట్టుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక విజయ్ సేతుపతి విషయానికి వస్తే.. తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ గా అవతారం ఎత్తిన ఈయన.. ఆ తర్వాత చాలా సినిమాల వరకు విలన్ గానే నటించి ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు ఒకవైపు తమిళ్లో హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇక్కడ తెలుగులో విలన్ గా తన పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడని చెప్పాలి. ఏది ఏమైనా అటు తమిళ్, ఇటు తెలుగులో విజయ్ సేతుపతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన విలనిజం పండించడమే కాదు కామెడీ పండించడంలో కూడా దిట్ట. అందుకే విజయ్ సేతుపతి అంటే అందరికీ ఎనలేని అభిమానం కూడా.