మీడియా రంగంలోకి అడుగుపెడుతున్న అల్లు అరవింద్.. వారి కోసమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ముఖ్యంగా అల్లు అరవింద్ నిర్మాతగా ఓటీటి దిగ్గజ ప్లాట్ ఫామ్ అయినా ఆహా కు ఓనర్ కూడా అల్లు అరవింద్ ఇలా అన్నిటిలో కూడా తనదైన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆహా అనే ఒక దినపత్రికను కూడా మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బయట వ్యక్తులు ఎవరు చెబుతున్న ప్రచారం కాదు ఇక అల్లు అరవింద్ స్వయంగా తన ట్విట్టర్ నుంచి ఈ విషయాన్ని షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అసలు ఆహా నుంచి బ్రాడ్ కాస్టింగ్ అండ్ మీడియా కంపెనీ అని రాసి ఉంది.. వాళ్ళు పోస్టులో ఇలా రాసుకురావడం జరిగింది.పొద్దున్నే ఒక చేతిలో కాఫీ మరొక చేతిలో పేపర్ ఆహా ఆ ఊహా చాలా బాగుంది కదా అంటూ ఆహా దినపత్రిక మీ ముంగిట్లో అంటూ అల్లు అరవింద్ తన ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది.. అయితే ఈ విషయం విన్న అభిమానులు ఇది నిజమేనా లేకపోతే ఇందులో ఏదైనా పబ్లిసిటీ మర్మము ఉందా అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే సినిమా వాళ్ళు ఇలా ప్రచార జిమ్మిక్కులు చేయడంలో బాగా సిద్ధహస్తులను చెప్పవచ్చు.. కాకపోతే ఆహా అనే ఒక మోస్ట్ హెడ్ తో ఉన్న పత్రిక ఫోటో కూడా పెట్టడం జరిగింది. దీన్ని చూశాక డౌట్స్ మరిన్ని ఎక్కువయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి .ఇదంతా జనసేన పార్టీ ప్రచారం కోసమే చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..ఒక పత్రికను స్టార్ట్ చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదు సంకల్పం బలం చాలా గట్టిగా ఉండాలి ఆ దిశగా అడుగులు వేయాలని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఇలాంటి విషయాల పైన ఆహా దినపత్రిక నిజమేనో లేదో క్లారిటీ ఇస్తారేమో అల్లు అరవింద్ చూడాలి మరి.