విడుదల కాకముందే రికార్డు బ్రేక్ చేస్తున్న సలార్ మూవీ..!!

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు.రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఫ్యాన్స్ అంచనాలను మాత్రం సలార్ సినిమా పైన భారీగానే ఉన్నాయి. కేజిఎఫ్ సినిమాతో పేను సంచలనాన్ని సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమా లొకేషన్ నుంచి విడుదలైన ప్రభాస్ స్టిల్స్ ఫోటోలు ఈ సినిమానీ మరింత హైప్ పెంచేస్తున్నాయి.

Prabhas Shoots An Action Sequence With Prashanth Neel For Salaar In Italy  At The Exact Location Of James Bond Film 'No Time To Die'
చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. హొంబలే ఫిలిమ్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సైతం విడుదల చేసి విధంగా ప్లాన్ చేస్తున్నారు సమాచారం. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలైందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ .300 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లుగా సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాలను ఈ చిత్రానికి సంబంధించి విడుదల రైట్స్ కూడా రూ.150 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఓవర్సీస్ రైట్స్ ,పహార్స్ డిస్ట్రిబ్యూటర్ రూ .65 కోట్లకు సొంతం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. తమిళ రైట్స్ రూ.23 కోట్ల నుంచి రూ .25 కోట్ల రేంజ్ లో రెడ్ జాయింట్ న్యూ డీలర్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.. దాదాపుగా రూ.50 కోట్ల టాబ్లెట్ తో కన్నడలో సలార్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇక హిందీలో మరికొన్ని డీల్స్ ఉండగా దాదాపుగా ఈ సినిమా రూ .400 కోట్లకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది.. ఈ సినిమా విడుదలకు ముందే ఇలా రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.