అఖిల్ పై అలా అభిమానాన్ని చాటుకున్న స‌మంత‌.. నిజంగా గ్రేట్‌!

స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయ్యింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గ‌డవకముందే నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది.

అయితే చైతుతో విడిపోయిన సరే అక్కినేని అఖిల్ తో మాత్రం ఆమె మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటూ వస్తుంది. సమంతకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలని విష్ చేసిన ఏకైక వ్యక్తి అఖిల్ మాత్రమే. ఇటీవల అఖిల్ బర్త్‌డేకి సైతం సోషల్ మీడియా వేదికగా స‌మంత‌ విషెస్ తెలిపింది.

తాజాగా అఖిల్ పట్ల మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది. అఖిల్ నటించిన `ఏజెంట్` సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి తొలి ఆట నుంచి డిజాస్ట‌ర్ టాక్ వచ్చింది. అయినా సరే సమంత నిన్న సాయంత్రం అభిమానుల సమక్షంలో AMB సినిమాస్ లో ఏజెంట్ ను చూసిందట. అభిమానుల కేరింతల మధ్య ఆమె సినిమాను బాగా ఎంజాయ్ చేసిందని తెలుస్తోంది. అంతేకాదు ఏజెంట్ చూసిన తర్వాత అఖిల్ కు స్వయంగా ఫోన్ చేసి సినిమాపై త‌న అభిప్రాయాన్ని తెలిపింద‌ని స‌మాచారం. ఈ విష‌యం తెలిసి స‌మంత నిజంగా గ్రేట్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest