చంద్ర‌బాబు కేబినెట్లోకి బాల‌య్య‌… ఇదెక్క‌డి ట్విస్ట్ రోయ్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోడు. అయినా ఏ పని చేసినా ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్లిపోతారు. స్టేజ్ పై పాట పాడాలన్నా, శ్లోకం చెప్పాలన్న, మరి ఏం చేసినా కూడా ఆయనకు ఆయనే సాటి అన్నట్లుగా బాలయ్య ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు.

టాక్ షోల‌ విషయంలో అగ్ర హీరోలు అందరూ భయపడుతుంటే బాలకృష్ణ మాత్రం ముందుకు వచ్చి అన్ స్టాపబుల్ షో తో ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పటికే రెండు సీజన్లు కంప్లీట్ చేసుకుని మూడో సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు బాలకృష్ణ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే ప్రచారం మొదలైంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు వార్తలు వస్తున్నాయి.

బాలయ్య వెబ్ సిరీస్ చేస్తున్నాడు అనేది నిజమే కానీ.. ఇది ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య, బోయపాటి శ్రీను తో మరో సినిమా చేయాల్సి ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా రానున్నాయి. ఇక దీంతో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు బాలకృష్ణకు ఎక్కువ సమయం లేదు.

అందుకే ఈ వెబ్ సిరీస్ ను 2024 చివరిలో మొదలు పెడతారని తెలుస్తుంది. ఇక ఆ సమయానికి ఎన్నికల హడావుడి కూడా పూర్తవుతుందని అప్పటినుంచి అయిన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు అని ఆయన సన్నిహితుల నుంచి తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాలయ్యకు మంత్రి పది వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Nandamuri Balakrishna defeats Chandrababu?

ఇక బాలయ్య అభిమానులు కూడా ఎంతోకాలంగా ఆయనను మంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు. మంత్రి అయ్యాక కూడా ఆయన సినిమాలు చేయాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest