పొన్నియిన్ సెల్వన్‌లో ‘ ఐశ్వర్య రాయ్ ‘ పాత్ర వ‌ద‌లుకున్న స్టార్ హీరోయిన్‌..!

తమిళ బాహుబలి గా చెప్పుకున్న పోన్నియన్ ‌సెల్వన్2 సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిభాగం కంటే మంచి టాక్ పార్ట్ 2 తెచ్చుకుంది. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు మణిరత్నం చోళ రాజ్యానికి సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించిన విషయం మనకు తెలుస్తుందే. అయితే ఆ పాత్ర కోసం మొదట ఆప్షన్ ఆమె కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Aishwarya Rai Bachchan looks regal at 'PS 2' trailer launch

ఐశ్వర్యరాయ్ ఏ పాత్ర చేసిన అందులో జీవించడం ఆమె యొక్క విజయ రహస్యం. తొలిభాగంలో కూడా ఆమె ఎంతో అద్భుతంగా నటించింది. ఇప్పుడు వచ్చిన రెండో భాగం లో కూడా ఐశ్వర్య తన నటనతో అదరగొట్టింది. నిజానికి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నంకు ఐశ్వర్యరాయ్ మొదటి నుంచి లక్కీ హీరోయిన్.. ఆయన కూడా మొదట ఐశ్వర్య చేసిన పాత్ర కోసం వేరే హీరోయిన్ ని అనుకున్నారట.

Telugu Aishwarya Rai, Maniratnam, Jayam Ravi, Karthi, Nayanathara, Nayanthara Ps

భారీ తారాగణంతో రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి రావడంతో సదురు హీరోయిన్‌ ఈ సినిమాకు నో చెప్పడంతో.. దర్శకుడు మణిరత్నం ఐశ్వర్యరాయ్‌ను తీసుకున్నారు. మొదటి భాగంలో ఐశ్వర్య పాత్ర కాస్త నెగటివ్ లుక్ ఉన్నట్టు కనిపించిన కూడా రెండవ భాగంలో ఆమె అసలైన క్యారెక్టర్ రివీల్ అవుతుంది. సినిమా లోని రెండు భాగాలు విడుదల అయినా తర్వాత ఆమె పాత్రలో మరొక హీరోయిన్ ని ఊహించుకోలేకపోతున్నారు అభిమానులు.

Telugu Aishwarya Rai, Maniratnam, Jayam Ravi, Karthi, Nayanathara, Nayanthara Ps

ఇక ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పాత్ర వదులుకున్న హీరోయిన్ ఎవరంటే లేడీ సూపర్ స్టార్ నయనతార ఆమె ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో పెళ్లి చేసుకోవాలని అభిప్రాయంతో ఉండడంతో ఆ పాత్రను మిస్ చేసుకుంది..అలాగే నయనతార జీవితంలో ఎన్నో మంచి సంఘటన కూడా ఆ సమయంలోనే జరిగాయి.
అయితే ఇలాంటి మంచి సినిమాను వదులుకున్నందుకు బాధపడిన సరైన సమయంలో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఇది అందరి హీరోయిన్లకు సాధ్యమయ్యే పని కాదు. ఇలా నయనతార ఆ పాత్రను వదులుకుంది.

Share post:

Latest