త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు.. ఇక కుర్రాళ్ల‌కు కునుకు క‌రువే!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫ్లాపుల‌తో ఎంత‌లా స‌త‌మ‌తం అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఏ సినిమా చేసినా.. అది బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా పడుతోంది.

సినిమాల సంగ‌తేమో కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో పూజా హెగ్డే కుర్రాళ్ల‌కు కునుకు క‌రువు అయ్యేలా చేస్తోంది.

ఈ పొడుగుకాళ్ల సుంద‌రి అందాల‌కు ఫిదా కాని వారుండ‌రు. తాజాగా త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్‌లో సిల్వ‌ర్ క‌ల‌ర్ డ్రెష్ లో అందంగా ముస్తాబై అప్సరలా ద‌ర్శ‌న‌మిచ్చింది.

డీప్ లో నెక్ లో ప‌రువాల విందు చేసింది. ఒంపుసొంపులు పోతూ హీట్ పుట్టించే విధంగా ఫోటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మ‌హేష్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రీ‌లీల మ‌రో హీరోయిన్‌గా అల‌రించ‌బోతోంది.

ఈ మూవీపైనే బుట్ట‌బొమ్మ ఆశ‌ల‌న్నీ పెట్టుకుంది. మ‌రి ఈ సినిమాతోనూ అయినా ఆమె జాత‌కం మారుతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Share post:

Latest